Source: www.andhrajyothy.com
Posted by: Guest on 30-06-2016 04:23,
Type: New/Special Trains , Zone: South Central Railway)
విజయవాడ - న్యూఢిల్లీ,
విశాఖ-విజయవాడ డబుల్ డెక్కర్
అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతి రాష్ట్రానికి రైల్వేపరంగా కావాల్సిన ప్రాజెక్టులు, కొత్త రైళ్ళకు సంబంధించిన పనులు జెట్‌వేగంతో జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు అమరావతికి రావటానికి మరో నూతన రైలు త్వరలో ప్రారంభం కానుంది. విజయవాడ-ధర్మవరం మధ్య రాకపోకలు సాగించే ఈ రైలు వారినికి మూడు రోజులు పాటు నడవటానికి విజయవాడ రైల్వే డివిజన అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు.
విజయవాడ - న్యూఢిల్లీ...
రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో నెలకు ఒకసారి సమావేశం నిర్వహించి రెండు నెలలకు ఒక కొత్త రైల్వే ప్రాజెక్టును పట్టాలమీదకు ఎక్కిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినట్లుగానే కొత్త రైళ్ళు ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్ళన్నీ న్యూఢిల్లీలో చక చకా కదులుతున్నాయి. విజయవాడ - ధర్మవరం సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభోత్సవం తర్వాత, రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి దేశరాజధాని న్యూఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ కూడా త్వరలో పట్టాల మీదకురానుంది. వారానికి ఒక్క రోజు నడిపే విధంగా రైల్వే బోర్డు సన్నాహాలు చేస్తోంది. రైల్వే బోర్డు గ్రీన సిగ్నల్ ఇవ్వగానే రాజధాని రైలు కూడా విజయవాడ నుంచి ప్రారంభం అవుతుంది.డబుల్ డెక్కర్‌కు గ్రీన సిగ్నల్....
విశాఖపట్నం - విజయవాడ మధ్య రాకపోకలు సాగించటానికి డబుల్ డెక్కర్ రైలు కూడా సిద్ధంగా ఉంది. ఇటీవల ట్రయల్ రన నిర్వహించిన ఈ రైలుకు సంబంధించిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్) సర్టిఫికెట్ కోసం, విజయవాడ రైల్వే డివిజన అధికారులు ప్రత్యేకంగా సికింద్రాబాద్ వెళ్ళారు. అనుమతి సర్టిఫికెట్ రాగానే ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తారు.